Bhoomika is playing a vital role in MCA movie. Recently, the movie unit has released the posters of the scenes including Bhoomika.
ఈ మధ్య భూమిక కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. పోయినేడాది బాలీవుడ్ మూవీ 'ఎం.ఎస్.ధోని'లో హీరో అక్క పాత్రలో కనిపించింది భూమిక. అందులో తన లుక్ చూడగానే ఇక ఆమె అక్క, వదిన పాత్రలకు ఫిక్సయిపోవాల్సిందే అన్న అభిప్రాయం కలిగింది ఆమె కూడా అదే అనుకుందేమో, నానికి వదినగా భూమిక కనిపించనుంది.
వదిన ఆర్టీఓ అధికారిగా పనిచేస్తుందట. నాని ఏమో గాలికి తిరుగుతుంటాడు. ఈ వదినకు, మరిదికి ఒక్క క్షణం కూడా పడదట. మరిదిని ఎప్పు డూ చిన్న చూపు చూస్తుందట వదిన. అయితే, అనుకోకుండా వదిన ఓ సమస్యలో ఇరుక్కోవడం... ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వదిన కోసం మరిది నిలబడటంతో.. మరిది గొప్పతనం తెలుసుకుంటుంది భూమిక.
అయితే, వినడానికి ఈ స్టోరీ సింపుల్‌గా ఉన్నా.. ట్రీట్‌మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడీ పాత్రకు సంబంధించిన లుక్స్ రివీల్ చేశారు. భూమిక సీన్స్ కు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేయగా.. ఒకదాంట్లో భూమిక, రాజీవ్ కనకాల దండలు మార్చుకునే సీన్ చూపించారు. మరో పోస్టర్ లో సీరియస్ గా ఉన్న భూమిక వెనుక.. అంతకంటే సీరియస్ గా ఉన్న నాని నడుస్తుంటాడు. రెండు పోస్టర్లు సూపర్బ్ గా ఉన్నాయి.