Yuzvendra Chahal Waiting For Rohit Sharma's Captaincy

2017-12-08 88

After registering their ninth straight series victory in Test cricket, India are all set to take on win Sri Lanka in the limited-overs series comprising of three ODIs and three T20Is.

భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ విరామం కావాలని అడిగాడు. కోహ్లీ సెలవుపై వెళ్లడానికి ఒప్పుకున్న బీసీసీఐ కెప్టెన్ పొజిషన్‌లో రోహిత్ శర్మను ప్రకటించింది. రోహిత్ వన్డే, టీ-20 మ్యాచ్‌లకు గాను కెప్టెన్సీ వహించనున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఐపీఎల్ మ్యాచ్‌నే తన కెరీర్‌లోనే మొట్టమొదటిగా యజువేంద్ర చాహెల్ ఆరంభించాడు.
భారత్‌కు శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్‌లో మార్పులు చేర్పులు కారణంగా మళ్లీ భారత్ తరపును చాహెల్ ఆడబోతున్నాడు. అతను ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్యనున్న సామీప్యతను మీడియాతో పంచుకున్నాడు.
2013 ఐపీఎల్‌లో నా అరంగేట్రం ముంబయి ఇండియన్స్‌ తరఫున రోహిత్‌ శర్మ నాయకత్వంలో చేశాను. కోహ్లీలాగే రోహిత్‌ శర్మ కూడా దూకుడు స్వభావం కలిగిన ఆటగాడే. జట్టును ముందుండి నడిపిస్తాడు. అయినప్పటికీ వీరిద్దర్నీ పోల్చలేం. ఎవరి స్టైల్‌ వారిదే. ఇద్దరిలో నేను గమనించింది. విజయాల కోసం వీరు ఎప్పుడూ ఆకలిగానే ఉంటారు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ విజయవంతమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ విజేతగా రోహిత్‌ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌ ట్రోఫీని దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా' అని చాహల్‌ వివరించాడు.