కన్నీళ్లు వచ్చాయి.. అరవింద్‌, శేఖర్ కమ్ములపై పవన్ ఫైర్ !

2017-12-08 5,282

Pawan Kalyan made serious allegations on Allu Aravind, Shekhar Kammula. Pawan said, Prajarajyam time, Allu aravind never considered as politician. He treated me as a actor only.

జనసేన పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థలపై అవగాహన నేపథ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ చేపట్టిన పర్యటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయన ఎక్కు పెడుతున్న విమర్శలు రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత అల్లు అరవింద్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ప్రజారాజ్యం విలీనంపై స్పందించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సమయంలో అల్లు అరవింద్ స్పందించకపోవడం తప్పు అని అల్లు అరవింద్ తీరుపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్‌చరణ్ ఉన్నాడుగా.. వారిని పంపించండి అని అరవింద్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా గుర్తు చేశాడు.