Comedian Saptagiri becomes as hero with Saptagiri Express movie.His latest movie is Saptagiri LLB. Its remake of the Hindi hit Jolly LLB. Saptagiri plays the titular role in the movie.
బొమ్మరిల్లు చిత్రంతో కమెడియన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాక్టర్ సప్తగిరి అనతికాలంలోనే జూనియర్ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో వరుస చిత్రాలు చేస్తూ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. జీవితంలో స్థితిగతుల్లో మార్పు ఉండాలనే లక్ష్యంతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా మారాడు. విజయాన్ని అందుకొని హీరోగా మంచి పేరు సంపాదించుకొన్నాడు. అలా కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లోనే మరోసారి సప్తగిరి హీరోగా వస్తున్న చిత్రం సప్తగిరి LLB. హిందీలో ఘనవిజయం సాధించిన జాలీ LLB చిత్రానికి ఇది రీమేక్. డాక్టర్ రవి కిరణ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానియన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఈ చిత్రంలో కశిష్ వోరా హీరోయిన్‌గా, సీనియర్ నటులు సాయికుమార్, శివప్రసాద్ తదితరులు ఇతర పాత్రలో నటించారు.