Though the CCTV grabs were not officially released, they are being circulated widely on social media and WhatsApp groups.
The ‘Chaddi Gang’ is in the city. And the cops want you to be alert. Kukatpally Housing Board police to urge citizens to be alert since the visuals have confirmed.
నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు తక్షణం అప్రత్తమయ్యారు. ఈ నెల 4న ఓ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంగా చెడ్డీ గ్యాంగ్ సభ్యులు మారణాయుధాలతో సంచరిస్తున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు గుర్తించారు. దీంతో కూకట్ పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
స్థానికులతో పాటు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్లకు వారి దృశ్యాలు చూపించి అవగాహన కల్పిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే తమకు సమాచారమివ్వాలని చెబుతున్నారు. అంతేకాదు, ఆచూకీ చెబితే రివార్డు కూడా ఇస్తామంటున్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏ సమాచారం అందినా వెంటనే కంట్రోల్ రూం నెంబర్ 100 లేదా 9490617129కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు.