MLA Roja on Chandrababu Naidu : బాబు కు నంది అవార్డు ఇవ్వండి !

2017-12-07 7

YSR Congress Party MLA Roja counter to Jana Sena Party chief Pawan Kalyan and Andhra Pradesh CM Chandrababu Naidu.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ గురువారం ఇచ్చారు. జగన్ పైనా, వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె స్పందించారు.
చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఆయన పిలుపునిచ్చారని, ఇప్పుడు దాని గురించి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత జగన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.పవన్ కళ్యాణ్ బుధవారం నాటి తన విశాఖ పర్యటనలో జగన్ పైన తీవ్రవిమర్శలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ఆ వెంటనే జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును విమర్శించరని, ఆయనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి అంత ఇంత మేలు చేసే దిశగానే ఇంతరవరకు ఆయన ప్రస్థానం కనిపించిందని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు వారసత్వ రాజకీయాలపై మాట్లాడే హక్కు లేదని రోజా అన్నారు. ఆయన మొదట వారసత్వ సినిమాలపై మాట్లాడాలని దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆయన అన్నయ్య లేకుంటే పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి, వారసత్వ సినిమాలపై మాట్లాడాలన్నారు. జగన్.. వైయస్ కొడుకుగా వచ్చినప్పటికీ తర్వాత తనను తాను నిరూపించుకున్నారని చెప్పారు.