Bangalore Ola Cab Incident : కారు డోర్‌ను లాక్‌ చేసి ఇలా ?

2017-12-07 1

Bengaluru : The victim, who is a fashion stylist, said the driver had engaged the child lock to trap the woman in his car.

మహిళా ప్రయాణికులపై క్యాబ్ డ్రైవర్ల ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళతో ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 23ఏళ్ల యువతి ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. అయితే.. కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో కారును డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆపి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా అరుస్తూ కాపాడమని కేకలు వేయడంతో కారు డోర్‌ను లాక్‌ చేశాడు. అతడిని ప్రతిఘటిస్తూనే.. బాధిత యువతి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. కొద్ది సేపటికి డ్రైవర్‌ కారు డోర్‌ను తీసేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.