చిన్నపిల్ల పై ఇదేంటి ? ఐశ్వర్యరాయ్ కూతురు పై ట్వీట్ | Filmibeat Telugu

2017-12-06 438

We always wait for Aaradhya Bachchan's adorable pictures with Aishwarya Rai Bachchan. The little diva often accompanies her mother and poses cutely for the paparazzi.

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య తరచూ తన తల్లితో కలిసి వివిధ కార్యక్రమాలు, వేడుకల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంగుళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అమ్మతో కలిసి ఆరాధ్య సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆరాధ్య లుక్ చూసి అభిమానులు పాప చాలా క్యూట్‌గా, అందంగా ఉందని ప్రశంసలు గుప్పిస్తుంటే... ఓ మహిళ ఆరాధ్య గురించి ఎవరూ ఊహించని ట్వీట్ చేసింది. దీనికి అభిషేక్ బచ్చన్ తగిన సమాధానం ఇచ్చారు.
ఆరాధ్య తరచూ తన తల్లి ఐశ్వర్యతో కలిసి కనిపిస్తుండటం, తన తండ్రితో తక్కువగా కనిపించడం, స్కూలు విషయాలు ప్రస్తావిస్తూ సదరు మహిళ ట్విట్టర్ ద్వారా అభిషేక్‌ను ప్రశ్నించింది.
ఇంకొంచెం వివరంగా వెళ్తే..‘మీ కుమార్తె స్కూలుకు వెళ్లడం లేదా? తల్లితో విహారయాత్రలకు వెళ్లాలి అనుకున్న ప్రతిసారి పాఠశాల యాజమాన్యం ఎలా సెలవులు ఇచ్చేస్తోంది..... లేక మీరు మీ అమ్మాయి అందంగా ఉంటే చాలు చదువు అక్కర్లేదని అనుకుంటున్నారా?' అంటూ సదరు మహిళ అభిషేక్ బచ్చన్‌ను ప్రశ్నించింది.

Videos similaires