Dr B R Ambedkar : Tributes Paid To Great Person, Watch

2017-12-06 10

Prime Minister Narendra Modi, President Ram Nath Kovind and vice president Venkaiah Naidu paid tributes to the architect of the Constitution BR Ambedkar on his anniversary on Wednesday.

డాక్టర్ BR అంబేద్కర్ 61వ వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని పార్లమెంట్ హౌజ్‌లోని అంబేద్కర్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందరూ అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇక మరోపక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం ట్విట్టర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పెరియార్‌ల ఫోటోలను పోస్ట్ చేశారు. తనకు ఇష్టమైన ఇద్దరు వారియర్స్ వీరే అంటూ ఆ ఫోటోలు పెట్టారు. సమాజంలో అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో తుది శ్వాస వరకూ అంబేద్కర్ పోరాడారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
అడుగ‌డుగునా బాధ‌ల‌కు, అవ‌మానాల‌కు గురై బీద‌రికాన్ని ఎదుర్కొంటూ..స్వ‌యం కృషితో , స్వీయ ప్ర‌తిభ‌తో స్వ‌తంత్ర భార‌త‌దేశంలో కేంద్ర‌మంత్రి ప‌ద‌వి అలంక‌రించిన అంబేద్కర్ …భార‌త రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్క‌ర్‌. అందుకే ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం నేడు ప్రజలకు జీవించే హక్కును, ఆహార హక్కును, విద్యా హక్కును, పని హక్కును తదితర హక్కులను న్యాయస్థానాలు అమలుపరిచేలా చేసింది.