Ashes 2nd Test: Australia win day night Test by 120 runs, lead series 2-0
అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది.రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (5/88) అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఐదోరోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 176/4తో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక్క పరుగుకే కెప్టెన్ జో రూట్ (67) వికెట్ కోల్పోయింది. జో రూట్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు.
చివరి రోజు విజయ లక్ష్యం 178 పరుగులే ఉండటం... క్రీజులో జో రూట్ ఉండటంతో ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే జోష్ హేజెల్‌ఉడ్ బౌలింగ్‌లో జో రూట్ పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఓవర్టన్ (7), స్టువర్ట్ బ్రాడ్ (8), జానీ బెయిర్‌స్టో (36)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్ పంపించాడు.రెండో ఇన్నింగ్స్‌లో 84.2 ఓవర్లకు 233 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5, జోష్ హాజెల్‌ఉడ్, నాథన్ లియాన్ చెరో 2 వికెట్లు తీసుకోగా... కుమ్మిన్స్‌కు ఒక వికెట్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన షాన్ మార్ష్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా జరగనుంది.