Watch Old Woman Lost Life due to a short circuit in east godavari.
షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం: వృద్ధురాలు సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లోని దిబ్బల పాలెం కాలేజి కి వెళ్ళే మార్గంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక పూరిల్లు పూర్తిగా ధగ్ధమయ్యింది. అర్థ రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో ఆ పూరిల్లు గమనించే వారు లేకపోవడంతో ఆ పూరిల్లులోనే నివసిస్తున్న పాండ్రింకి సీతమ్మ (65) అనే వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది. అనారోగ్యంతో ఉన్న కారణంగా బయటకు రాలేని పరిస్థితుల్లో మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయింది. గుర్తించటానికి వీలు లేనంతగా కాలిపోయింది. దీనితో ఏలేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గత నెలలో కూడా ఇలాంటి సంగటనే చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో షార్ట్ సర్క్యూట్ ఒక వృద్ధురాలు మృతి చెందింది. అయితే షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి గల కారణాలేంటో తెలుసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రమాదం జరిగాక జాగ్రత పడే కంటే ముందే నివారణ చర్యలు చేస్తే అందరికి మంచిది.