Jayalalithaa Daughter Issue : అమృత మీద చట్టపరంగా పరువు నష్టం దావా

2017-12-05 2

Sources said that TamilNadu Govt. will file a defamation case against Amrutha who is claiming a daughter of Jayalalithaa.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శోభన్ బాబుల కుమార్తె నేనే అంటూ హైకోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్న బెంగళూరు మహిళ అమృత (37) విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అమృత విషయంలో చూసిచూడనట్లు ఉంటే ఈ వ్యవహారం చాలా వరకు వెళ్లే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
దేశ విదేశాల్లో లక్షల మంది అభిమానులు ఉన్న జయలలితకు వివాహం కాకపోయినా తానే ఆమె కుమార్తె అంటూ అమృత ప్రచారం చేసుకుంటున్నారని పలువురు అన్నాడీఎంకే పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జయలలిత కుమార్తె అంటూ అమృత తెరమీదకు రావడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది