Congress is playing catch-up in virtual space. From creating a buzz around Congress vice-president Rahul Gandhi’s rallies to a Congress leader’s book launch to wishing party seniors on their birthdays, the so-far nascent social media cell of the Grand Old Party has suddenly come alive
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టడమే లక్ష్యంగా సోనియా గాంధీ నుంచి వారసత్వ పగ్గాలు అందుకునేందుకు రంగం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సోషల్ మీడియాలో బీజేపీని, ప్రధాని మోడీని కాంగ్రెస్ అడ్డుకుంటుందా అనే చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు సోషల్ మీడియా కూడా దోహదపడింది. కాంగ్రెస్ ఇటీవలి వరకు సోషల్ మీడియా లో అంత యాక్టివ్గా లేదనే చెప్పాలి.
సోషల్ మీడియా కర్నాటకకు చెందిన మాజీ ఎంపి, నటి రమ్య చేతికి వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ ఎంతో యాక్టివ్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీతో పోటీ పడేందుకు రమ్య, ఆమె టీం పని చేస్తోంది.