టీడీపీ వైపు చూడకూడదు, మాట్లాడకూడదు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూల్

2017-12-05 5

TDP leader and MLA Giddi Eswari on fired at YSRCP and it's president YS Jaganmohan Reddy.

ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 'వైసీపీలో ఇతరుల అభిప్రాయాలు తీసుకోవడం లాంటివి ఉండవు. జగనే నిర్ణయాలు తీసుకుంటారు. మామూలుగా పార్టీ మీటింగుల్లో అభిప్రాయాలు చెప్పమంటారు. చిట్టచివరికి ఏదైనా అభిప్రాయం చెప్పినా.. అంతవరకే ఉంటాయి. నిర్ణయాలు మాత్రం ఆయనే తీసుకుంటారు. అభిప్రాయాలు చెప్పమంటారు కానీ, మనం చెప్పిన అభిప్రాయాల్లో దేనినీ టేకప్ చేసినటువంటి పరిస్థితులు లేవు. వాళ్లు చెప్పమన్నారు కనుక అభిప్రాయాలు చెబుతాం' అని గిడ్డి ఈశ్వరి తెలిపారు.
‘కుంభా రవిబాబు, పసుపులేటి బాలరాజు వంటి లీడర్స్ ని పార్టీలోకి తీసుకోకండి. వాళ్లు నాన్ లోకల్ ట్రైబ్స్' అని చెప్పాను. దీంతో 'దానితో నీకేం సంబంధం. నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు?' అని జగన్ అడిగారు. అంతే కాకుండా 'కుంభా రవిబాబు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి ... ఇతర విషయాలు నీకెందుకు?' అని జగన్ అన్నారు. దీంతో అన్నా ఇది మీకు భావ్యం కాదు అని బతిమాలితే.. 'ఇలాంటి సోది మాట్లాడవద్దు..ఇలాంటి పంచాయతీ నాకు వద్దు' అని వెళ్లిపోయారు. దీంతో నేను షాక్ తిన్నాను’ అని ఈశ్వరి తెలిపారు