అల్లు అర్జున్, మహేష్ సినిమాపై ఎఫెక్ట్ ! కారణం ఇదే !

2017-12-04 656

Tollywood producer Bunny Vasu unhappy over the postponement of the Rajinikanth's 2.0 from January to April, as it would clash with his upcoming movie Naa Peru Surya Naa Illu India

రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0' సినిమా జనవరిలో విడుదలవ్వాల్సి ఉండగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఏప్రిల్‌లో ఏ డేట్ అనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ టాలీవుడ్ నిర్మాతలకు సందేశం పంపినట్లు సమాచారం.
లైకా ప్రొడక్షన్స్ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. అందుకు కారణం ఏప్రిల్ 27వ తేదీనే అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య', మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అను నేను' రిలీజ్ ఇప్పటికే ఫిక్స్ చేసుకోవడమే.
ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో పరిస్థితి చాలా టైట్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను ఇద్దరూ పంచుకోవాల్సిన పరిస్థితి. ఇపుడు రజనీకాంత్ 2.0 సినిమా కూడా వస్తే పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది.

Videos similaires