Rahul Gandhi files nomination for Congress president's post

2017-12-04 198

Congress Vice-President Rahul Gandhi is all set to file the nomination papers for the post of party chief, today.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. సీనియర్ నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తదితర నేతలు ఆయనను ప్రతిపాదించారు. 4 సెట్లపై 40 మంది సంతకాలు చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాహుల్ గాంధీకి ఎవరూ పోటీ లేనందున ఆయనను ఈ రోజే అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలి వచ్చారు. నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఆరో వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఇరవై ఏళ్లు కొనసాగారు. ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఇంతకాలం ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 9, 14 తేదీల్లో జరుగుతాయి. ఈ దఫా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మతాల ప్రాతిపదికన కాక కులాలు.. వివిధ సామాజిక వర్గాల మధ్య రాజకీయ పునరేకీకరణ దిశగా సాగుతున్నాయి.