Aadhaar number has to be furnished for availing of all social security schemes. In order to avail pension, LPG cylinders or government scholarships, one must provide Aadhaar card details.
మీరు ఆధార్ లింక్ చేశారా? లేదా? త్వరపడండి.. ఆధార్ లింక్ చేయకపోతే తిప్పలు తప్పవు. బ్యాంకు ఖాతాలు, బీమా చెల్లింపులు నిలిచిపోతాయి. ఐటీ రిటర్నులు కూడా ఆమోదించరు. ఇంకా మీ మొబైల్ కనెక్షన్ కూడా కట్ అవుతుంది. సబ్బిడీలు అందవు. పెన్షన్లు నిలిచిపోతాయి. చివరికి మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందుకునే వ్యక్తులు ఈ డిసెంబరు 31లోగా తమ ఆధార్ నంబర్ వివరాలు సమర్పించాలి. నిజానికి ఈ గడువు ఈ ఏడాది సెప్టెంబరు 30తోనే ముగిసింది. పించన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ అయ్యే చౌక బియ్యం, గోధుమలు వంటి వాటికీ ఆధార్ తప్పనిసరి. సబ్సిడీ వంట గ్యాస్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అందించే ఉపకార వేతనాలు అందుకోవాలన్నా మీ ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయాల్సిందే.