Jayalalitha Daughter:Jayalalitha's Letter on Relationship With Shobhan Babu

2017-12-04 26

A letter from Jayalalithaa to Magazine on her relationship with Shobhan babu.

జయలలిత కుమార్తెనని చెబుతూ అమృత అనే యువతి తెర పైకి రావడంతో.. తమిళనాడులో ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జయలలిత-శోభన్ బాబుల అనుబంధం గురించే ఎక్కువమంది చర్చించుకుంటున్నారు. డీఎన్ఏ పరీక్షకైనా సిద్దమంటూ అమృత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడానికి సిద్దమవుతున్నారు. మరోవైపు అమృత జయలలిత-శోభన్ బాబుల కుమార్తెనె అనేందుకు రోజురోజుకు ఆధారాలు బలపడుతూనే ఉన్నాయి. జయలలిత స్నేహితురాలు గీత ఇప్పటికే అమృత ఆమె బిడ్డే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో శోభన్ బాబు సైతం ఇదే విషయాన్ని తనతో చెప్పినట్లుగా ఆమె వెల్లడించారు. అయితే జయలలితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా ఓ కథనం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, అయితే ఆయన వివాహితుడు కావడం వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు అప్పట్లో జయలలితే స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.