Amaravati : Farmers Pay The Price For 'Capital'

2017-12-02 115

Several farmers in the Krishna delta supported the experimental pooling scheme, as a better alternative to the known of land acquisition.

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి డిజైన్లను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఓకె చేసినట్లు తెలుస్తోంది. హైరైజ్ బిల్డింగ్ రూపంలో నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్స్ ను ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం.అయితే వీటిపై తుది నిర్ణయం విషయంలో ప్రజల అభిప్రాయాలను కూడా కోరనుంది ప్రభుత్వం. ఇందుకోసం సీఆర్డీయే(క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ)లో డిజైన్లను అందుబాటులో ఉంచారు. డిజైన్లపై వెబ్ సైట్ ద్వారా ఎవరైనా సరే ప్రభుత్వానికి సలహాలు-సూచనలు ఇవ్వవచ్చు.
కానీ ఇదంతా పక్కనపెడితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల గురించే ఇప్పుడంతా చర్చ నడుస్తుంది. రాజధాని నిర్మాణం అనుకోగానే ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకునే పని మొదలు పెట్టింది. అయితే చాలామంది ప్రభుత్వం మీద నమ్మకంతో కళ్ళు మూసుకుని భూములు ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రం గట్టిగా తమ వ్యతిరేకత తెలియచేసారు. అయితే భూములు ఇచ్చిన వారు నాయుడు కమ్మ కులాలు వారు, వ్యతిరేకించిన వారు ysrcp వర్గానికి చెందిన రెడ్డి మొదలగు సామాజిక వర్గాలకు చెందిన వారు అన్న ఒక మాట కూడా లేకపోలేదు. సరే అదికూడా పక్కన పెడితే రాజధాని నిర్మాణానికి ఎందుకు ముహూర్తం కుదరట్లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజానికి ఏపీ చంద్రబాబు కూడా ‘అమరావతి నిర్మాణానికి తొందరేముంది?' అని పలుమార్లు వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా అమరావతి నగరాన్ని నిర్మించాలని మేం తలపెట్టాం. కనుక తొందరేం లేదు' అని పేర్కొన్నారు.