Cyclone Ockhi Updates : Watch తుపాను దెబ్బకు హై అలర్ట్

2017-12-01 1,081

Cyclone Ockhi, that eight people lost life in coastal Kerala and Tamil Nadu, is moving closer to Lakshadweep. As of this morning, Cyclone Ockhi is hovering 160 km east of Lakshadweep in the Arabian Sea

తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన రెండు గంటల్లోనే తమిళనాడు రాష్ట్రంలో సముద్ర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో వర్షాలు మొదలయ్యాయి.భారీ వర్షాలకు ఓఖి తుపాను తోడవటంతో కన్యాకుమారి జిల్లాలో గాలివానలు బీభత్సం సృష్టించింది. సుమారు 900 చెట్లు రోడ్లకు అడ్డంగా కుప్పకూలిపోవడంతో అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది.
ఓఖి తుపాను కారణంగా కన్యాకుమారి జిల్లాలో నలగురు, కేరళలో నలుగురు మృతి చెందారు. కొన్ని వందల మందికి గాయాలైనాయి. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమై రోడ్ల మీద కుప్పకూలిలన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగిస్తున్నారు.