Hyderabadis are enjoying metro journey now in city, but at the same time they dont have enough knowledge about L&T rules and regulations, due to this they are paying penalties.
ఎప్పుడెప్పుడా అన్న నిరీక్షణకు తెరపడి భాగ్యనగర వాసులు మెట్రో ప్రయాణ కల నెరవేరింది. దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే తొలి రెండు రోజులు భాగ్యనగర మెట్రోకు విపరీతమైన ఆదరణ లభించింది. మెట్రోతో నగరవాసుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ.. నిబంధనలపై అవగాహన లేకపోవడం కొంతమందిని గందరగోళానికి గురిచేస్తోంది. మెట్రో నిబంధనల గురించి ప్రజలకు ఇంకా పూర్తి స్థాయి అవగాహన ఏర్పడలేదు. దీంతో మెట్రో స్టేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు పాటించలేకపోతున్నారు. ఫలితంగా తమ స్మార్ట్ కార్డుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు అవుతున్నాయి. అంతేకాగా, రెండు గంటలకు మించి స్టేషన్లలో ఉండరాదన్న నిబంధన కూడా చాలామందికి తెలియలేదు. దీంతో నిబంధనలు తెలియక కొంతమంది జరిమానాలు చెల్లించేసుకుంటున్నారు.