KTR And Nara Lokesh On One Stage Soon

2017-11-30 787

Sources said that Telangana IT minister KTR and Andhra Pradesh IT minister Nara Lokesh have accepted the invite to take part in Harvard 2018 conference.

వారిద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులు. ఆయా రాష్ట్రాల్లో దాదాపు ఒకే శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు ఇప్పటికే దూసుకుపోతుంటే.. మరొకరు ఇప్పుడే తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను తెచ్చుకుంటున్నారు. వారే ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, ఐటీ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, మరొకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేష్. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. వారిద్దరూ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 15వ వార్షికోవత్సవం ఇందుకు వేదిక కానుంది. 2018 కాన్ఫరెన్స్‌‌లో పాల్గొనేందుకు ఇప్పటికే ఈ యువనేతలు తమ ఆహ్వానాన్ని అంగీకరించారని నిర్వాహక వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఇదే విషయాన్ని కేటీఆర్ అధికారికంగా ధ్రువీకరించగా.. లోకేశ్ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని చెబుతున్నారు. కేటీఆర్, లోకేశ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసిపాల్గొంటున్న తొలి సదస్సు ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్సుల్లో హార్వర్డ్ కాన్ఫరెన్సు కూడా ఒకటి. దాదాపు వెయ్యిమందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.