Mera Bharath Mahan new telugu movie launched today at hyderabad.
ప్రత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ''భరత్'' డైరెక్టర్ గా నిర్మాతలు.డా.శ్రీధర్ రాజు,డా.తాళ్ల.రవి,డా.టి.పి.ఆర్.కలిసి నిర్మిస్తున్న చిత్రం''మేర భారత్ మహాన్''ది అర్జెన్సీ ఆఫ్ చేంజ్.,ఉప శిర్షిక,ఈ సినిమాని ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో లాంచనంగా మొదలు పెట్టారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దర్శకుడు సాగర్,దర్శకుడు.బి.గోపాల్,గీత రచయిత.చంద్ర బోస్ హాజరయ్యారు.
ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ ముజిర్ మాలిక్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన త్రిముర్తుల్లాంటి నిర్మాతలకు మరియు దర్శకుడు భరత్ కి నా ధన్యవాదాలు నేను చోట.కే.నాయుడు దగ్గిగా సహాయ కెమెరామెన్ గా పని చేసాను అప్పట్నుండి నాకు భరత్ నాక్ తెలుసు అయన కెమెరా ఆంగెల్స్ చాలా బాగుంటయి ఆయనతో పని చెయ్యటం ఆనందంగా వుంది సినిమా కధ బాగుంది అందరికి నచ్చుతుంది అంటూ సినిమా యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమా మాటల రచయిత ఎర్రం సెట్టి సాయి మాట్లాడుతూ ఇది చాలా కష్టమైనా కధ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సమస్యలను గురించి చర్చిస్తూ సాగే కధ ఇందులో అనుకున్నంత ఎంటర్తైన్మెంట్ ఉండక పోవచ్చు కాని ఈ సినిమా మిద మా యూనిట్ అందరికి పూర్తి నమ్మకం వుంది దర్శకుడు కూడా చాలా తెలివైన వ్యక్తి కాబట్టి నాకు పెద్దగా పని ఉండక పోవచ్చు సినిమా మంచి విజయం సాదిస్తుంది అని అన్నారు.