India vs Sri Lanka : Virat Kohli May Rested For T20 Series Too

2017-11-29 106

Rested from the one-days against Sri Lanka, Indian captain Virat Kohli is uncertain for the Twenty20 series as well and will decide on his participation after consulting the team management and the selection committee later this week.

టెస్టు సిరిస్ అనంతరం శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూడు టీ20ల సిరిస్‌కు కూడా కోహ్లీ దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. లంకతో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
కోహ్లీ స్థానంలో రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అయితే ఇప్పుడు టీ20ల్లో బరిలోకి దిగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇందులో భాగంగానే టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారి మంగళవారం తెలిపారు.
డిసెంబరు 12 వరకు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండలేనని కోహ్లీ సెలక్టర్లకు తెలిపాడు. ఆ తర్వాత లంకతో టీ20ల్లో ఆడే దానిపై స్పష్టత ఇచ్చేందుకు కొంత సమయం అడిగాడు. ఆ కారణంగానే సోమవారం లంకతో తలపడే భారత టీ20 జట్టును ప్రకటించలేకపోయాం' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.