హీరోయిన్ ని పెళ్ళాడబోతున్న బ్రిటన్ కింగ్.. ప్రియాంక చోప్రా కామెంట్

2017-11-28 407

Priyanka Chopra took to Instagram to wish Suits actor Meghan Markle and Prince Harry, on their engagement. The Baywatch star took to Instagram to wish her close friend. She wrote, "Congratulations to my girl meghanmarkle and Prince Harry!! I'm so happy for you Meg! You deserve the best always..keep smiling that infectious smile. Xoxo." (sic).

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహానికి బ్రిటన్ రాజకుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బ్రిటన్‌కు రాజ కుటుంబం అఫీషియల్ ప్రకటన చేసింది. మేఘన్ మార్కెల్‌తో యువరాజు ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపిన రాయల్ ఫ్యామిలీ 2018లో వీరి వివాహం జరుగనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వివాహ తేదీని ప్రకటించనున్నారు.
ఈ విషయమై అందాల తార ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. మేఘన్‌కు హ్యారీ తగిన వరుడు, సరైన జోడి అని ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్ చేసింది.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నేపథ్యంలో మేఘన్ మార్ల్కేతో ప్రియాంక చోప్రాకు మంచి సంబంధాలు ఏర్పాడ్డాయి. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తన స్నేహితురాలు ప్రిన్స్ విలియమ్‌ను వివాహం చేసుకోవడంపై ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు.
ప్రియాంక, మేఘన్ తొలిసారి టొరొంటోలో జరిగిన ఓ పార్టీలో కలుసుకొన్నారు. మేఘన్ ఆ సమయంలో కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది. దాంతో ప్రియాంకను ఆమె ఇంటర్వ్యూ చేశారు.
ఇదిలా ఉండగా, ప్రిన్స్ హ్యారీ పెళ్లి గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ నిశ్చితార్థం చేసుకోబోతున్న నేపథ్యంలో మిచెలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరిద్దరూ జీవితాంతం సుఖ: సంతోషాలతో ఉండాలని కోరుకొంటున్నాం అని అన్నారు.

Videos similaires