Radio signals hint at North Korea next Step

2017-11-28 1,774

Japan has detected radio signals suggesting North Korea may be preparing for another problem launch, although such signals are not unusual and satellite images did not show fresh activity, a Japanese government source said on Tuesday.

గత సెప్టెంబర్ నెల దాకా అణుప్రయోగాలతో ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన ఉత్తరకొరియా.. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా వెనక్కి తగ్గినా.. అమెరికా మాత్రం తన నిఘాను తగ్గించలేదు.
ఉత్తరకొరియా నుంచి ఎప్పుడెలాంటి విపత్కర ప్రమాదాన్ని ఎదురవుతుందోనన్న ఉద్దేశంతో.. జపాన్, దక్షిణ కొరియా దేశాల సహాయంతో నిరంతర నిఘాను కొనసాగిస్తూనే ఉంది.
ఇటీవలి కాలంలో మునుపటి స్థాయి ఉద్రిక్తతలు అంతగా చోటు చేసుకోలేదు. దీంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్దం ఆలోచన విరమించుకున్నారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అదే నిజమనుకోవడానికి లేదు. జపాన్‌కు అందిన కొన్ని రేడియో సిగ్నల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఉత్తరకొరియా మరో అణు ప్రయోగానికి సిద్దపడుతున్నట్లు తాజాగా జపాన్ కు కొన్ని రేడియో సిగ్నల్స్ అందాయి. అయితే ఆ సిగ్నల్స్ అసాధారణమైనవేమి కాకపోవడం, శాటిలైట్ ఛాయా చిత్రాల్లోను ఉత్తరకొరియా కొత్త యాక్టివిటీకి సంబంధించిన చిత్రాలేవి లేకపోవడం గమనార్హం. జపనీస్ ప్రభుత్వం మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.