With the 30-km Metro rail is all set to become operational in a couple of days, the project developer L&T Metro Rail Hyderabad is gearing up to start malls at various places in the city.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్ 'హైదరాబాద్ మెట్రో'. దాదాపు రూ.15వేల కోట్ల వరకు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినట్టు చెబుతున్నా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏది లేదు. దేశంలోని మిగతా మెట్రోల కన్నా ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ఎల్&టీ సంస్థ ఖర్చు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే కేవలం మెట్రో ఛార్జీల ద్వారానే తమ పెట్టుబడులను వెనక్కి రాబట్టుకోవడం కష్టం అని చెబుతూ.. ఆయా స్టేషన్ల పరిధిలో ఎల్&టీ మాల్స్ నిర్మాణం కూడా చేపట్టింది.
మెట్రో రైలు ప్రారంభోత్సవం తరువాత మాత్రమే ఎల్&టీ కంపెనీకి మాల్స్ ప్రారంభం చేసుకునే అనుమతినిచ్చారు. మంగళవారం మెట్రో ప్రారంభోత్సవం జరుగుతుండటంతో త్వరలోనే మాల్స్ ప్రారంభానికి కూడా ఎల్&టీ సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరలో వీటిని ప్రారంభించే అవకాశముంది. పంజాగుట్ట, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్స్ మధ్య కి.మీ దూరంలో రెండు మాల్స్ ను ఎల్&టీ ఏర్పాటు చేసింది. ఈ రెండు మాల్స్ లో 12వరకు సినిమా హాల్స్ ఉన్నాయి. సినిమా హాల్స్ తో పాటు ఈ మాల్స్ లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల దుకాణాలు ఉండనున్నాయి. ఈ రెండు మాల్స్ ను రాబోయే నెల రోజుల్లో ప్రారంభించే యోచనలో ఎల్&టీ ఉంది. డిసెంబర్ చివరిలోగా వీటి సేవలు అందుబాటులోకి రావచ్చు.