Hyderabad Metro Rail Records : Need to Know

2017-11-28 836

The Hyderabad Metro Rail project, to be inaugurated by Prime Minister Narendra Modi on November 28. The metro completed 3lakh kilometer trail run before inauguration

2007లో మెట్రో పనులు మొదలైన నాటి నుంచి హైదరాబాద్ ప్రజలంతా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత ఇప్పుడా కల సాకారం కాబోతోంది. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నాం 2.15గం.కు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రోకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
దేశంలో 30 కి.మీల మేర మెట్రో రైలు సేవలను ఒకేసారి ప్రారంభోత్సవం చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. దీంతో హైదరాబాద్ మెట్రో ప్రారంభంలోనే రికార్డును సొంతం చేసుకుంది. శనివారం నాడు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి మెట్రోలో ప్రయాణించిన తర్వాత మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఆగ‌స్టు 7, 2014న అధికారులు తొలిసారి మెట్రో ట్రయ‌ల్ ర‌న్ నిర్వహించారు. అప్పటినుంచి ఇప్పటివరకు మెట్రో రైలు ఏకంగా 3లక్షల కి.మీ ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెట్రోలో ఏవిధమైన లోపాలు లేకుండా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు.
నేడు మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా.. మొత్తం 18రైళ్లు, 30కి.మీ మార్గంలో సేవలందించడానికి సిద్దమయ్యాయి. కాగా, హైదరాబాద్ లోని మూడు కారిడార్లలోని 72 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మెట్రో రైళ్ల‌ను న‌డిపేందుకు రెండేళ్ల క్రిత‌మే 57 రైళ్ల‌ను కొరియా నుంచి అధికారులు దిగుమ‌తి చేసుకున్నారు. అందులో రెండింటిని నాగ్‌పూర్‌ మెట్రోకు అద్దెకు ఇవ్వ‌గా ప్ర‌స్తుతం 55 ఉన్నాయి.