Ivanka Trump in Hyderabad : Security beefed up in Hyderabad

2017-11-28 274

Security has been tightened in Hyderabad, ahead of U.S. President Donald Trump's advisor Ivanka Trump and Prime Minister Narendra Modi's visit for Global Entrepreneurship Summit (GES) on Tuesday
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) 2017 నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో మంగళవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ పర్యటనతో పోలీసులు భారీ భద్రతతో పాటు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసులను కేటాయించారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సుకు భద్రత విషయాన్ని పోలీసు యంత్రంగం ఒక సవాలుగా తీసుకుంది.మియాపూర్‌, కూకట్‌పల్లి, ఫలక్‌‌నుమా, చంద్రాయణగుట్ట, ఆరాంఘడ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను వేరే మార్గాల్లో మళ్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు