దుమ్ము రేపుతున్న అజ్ఘాతవాసి ఫస్ట్‌లుక్.. సోషల్ మీడియాలో వైరల్

2017-11-27 3,220

The wait is finally over! Here's the much awaited first look of power star PawanKalyan from #AgnathaVaasi. Pawan Kalyan and Trivikram Srinivas latest movie title confirmed with AgnathaVaasi.

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ అనే ఉత్కంఠకు తెరపడింది. హారిక, హాసిని బ్యానర్‌పై పీ రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అజ్ఞాతవాసిగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ అజ్ఞాతవాసి‌గా విస్తృతం ప్రచారంలో ఉంది.
అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ పవన్ కల్యాణ్ మేనరిజాన్ని మరోసారి గుర్తు చేసింది. సోఫాలో కూర్చొని చేతిలో ఆఫీస్ ఐడెంటీ కార్డును తిప్పుతూ గుర్రుగా చూస్తున్న పవన్ కల్యాణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అజ్ఞాతవాసి టైటిల్‌కు ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనే ట్యాగ్‌ను పెట్టారు. ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్ర షూటింగ్ వారణాసిలో జరుగుతున్నది. ఈ షూటింగ్ సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ కొత్త ఖాతాను తెరిచారు. తన మనసులోని భావాలను, అభిప్రాయాలను ప్రజలు, అభిమానులతో పంచుకునేందుకు పాత అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.