వర్మ పెద్ద పంచ్ ఇచ్చాడు.. నాగార్జునకి రొమాన్స్ లేదట !

2017-11-25 205

It has been learnt that Nagarjuna, the king of romance in Tollywood, will not romance the female lead in his upcoming film with Ram Gopal Varma.

రామ్‌గోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ కాంబినేషన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. ఈ ఇద్దరూ గతంలో మాదిరిగానే మళ్లీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సెన్షేషనల్ కాంబోలో ఇన్నేళ్లకు మళ్లీ ఓ మూవీ తెరకెక్కబోతోంది అన్న వార్త రాగానే ఇండస్ట్రీ మొత్తం అటుపక్క ఆసక్తిగా చూపు తిప్పింది. ఇప్పుడు ఆ సినిమా గురించి తెలిసే ప్రతీ చిన్న విషయమూ ఇంట్రస్టింగే...
సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మామూలుగా వర్మ సినిమాలో ఎక్కువ శాతం ఫైట్స్‌తో పాటు అక్కడక్కడ కాస్త రొమాన్స్ జోడించడం అలవాటు.
అయితే నాగార్జున, వర్మ కాంబినేషన్‌ సినిమాలో అక్కినేని అభిమానులు, వర్మ అభిమానులు అనుకున్నట్లుగా ఈ సినిమా ఉండదట.
సినిమా మొత్తం గతంలో ఒక ప్రయోగంగా వచ్చిన "గగనం" తరహాలో ఉంటుందనే చర్చ జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రొమాన్స్‌, కామెడీ, పాటలకు నో ఛాన్స్‌. కేవలం యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రొమాన్స్ అనే మాట మాట్లాడటానికి వీల్లేదు. అంతేకాదు పాటలు అస్సలు లేవట. ఒక వేళ పాటలు ఉన్నా బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఒకటి రెండు తప్ప అంతకు మించి ఉండవట.
మరి హీరోయినో అంటే..టాలీవుడ్‌‌లో పేరుగాంచిన సీనియర్ హీరోయిన్ ని బుక్ చేయటానికి ప్రయత్నిస్తూన్నారు... . అయితే ఆ హీరోయిన్ పేరు మాత్రం ఇంత వరకూ ఎక్కడా బయటికి రాలేదు. యూనిట్ కూడా కావాలనే ఆ పేరుని బయట పెట్టటం లేదు...