The protests against Padmavati have now reached the capital. The right-wing group Rashtrapati Chetna Manch had organised the protest in which some Bharatiya Janata Party (BJP) functionaries also participated.
పద్మావతి చిత్ర వివాదం ఇప్పుడు దేశ రాజధానికి చేరుకొన్నది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రపతి చేత్న మంచ్ అనే హిందుత్వ సంస్థ ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించింది. ఇందులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాలుపంచుకోవడం మరింత వివాదంగా మారింది. రాజ్‌పుత్ కమ్యూనిటికి చెందిన కథతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వ్యతిరేకంగా పలు హిందుత్వ సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
పద్మావతి చిత్రానికి, భన్సాలీకి వ్యతిరేకంగా పలు హిందూత్వ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి ప్రాంతంలో భారీ ర్యాలీని నిర్వహించారు. భన్సాలీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భన్సాలీ చిత్ర పటానికి చెప్పుల దండలు వేసి ఊరేగించారు.
పద్మావతికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆజాద్‌పూర్‌లోని ఓ కూడలిలో భన్సాలీ దిష్టిబొమ్మను మంటల్లో తగులబెట్టారు. దిష్టిబొమ్మ కాలుతుండగానే చెప్పులు విసిరి నిరసనను వ్యక్తం చేశారు.
పద్మావతి ఓ కమ్యూనిటికి చెందిన వారు కాదు. ఆమె దేశానికి మొత్తం ఓ ప్రతీక. శత్రుదేశాల రాజు దండయాత్ర చేయడంతో ఆత్మార్పణం చేసుకొన్నారు. అలాంటి త్యాగమూర్తి రాణి పద్మినీ చరిత్రకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. అని బీజేపీ నేత రోషన్ కెన్సల్ అన్నారు.
ఢిల్లీలో పద్మావతి చిత్రాన్ని విడుదల చేయడానికి ఒప్పుకోం.