Mysterious booming sounds have been recorded from different places across the globe leaving people as well as experts baffled, the media reported.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు కొన్ని వింత శబ్దాలు అంతుచిక్కని విధంగా మారాయి. గత కొన్నాళ్లుగా అంతరిక్షం నుంచి వెలువడుతున్న ఆ శబ్దాలు నాసా శాస్త్రవేత్తలతో పాటు ప్రజలను కూడా భయపెడుతున్నాయి.
భూగోళం మీద ఇప్పటికే 64ప్రాంతాల్లో ఈ వింత శబ్దాలు రికార్డు అయినట్టుగా నాసా అధికారులు గుర్తించారు. అయితే ఆ శబ్దాలు ఏంటనేవి మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆస్ట్రేలియాలోని మిడిల్ ఈస్ట్ నుంచి ఈస్ట్ మిడ్ లాండ్స్ వరకు ఈ మిస్టరీ శబ్దాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి ప్రజలు ఈ శబ్దాలకు బెంబేలెత్తిపోతున్నారు.
ఆస్ట్రేలియా, అమెరికాల్లో రికార్డయిన మిస్టరీ శబ్దాలను నాసా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. అమెరికా తూర్పు తీరంలో ఎక్కువమంది ఈ శబ్దాలను విన్నట్టు చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని అలబామా వాసులను కూడా ఈ వింత శబ్దాలు భయపెట్టాయి. శబ్దాలకు వణికిపోతున్న ప్రజలు.. వీటిని 'బామా బూమ్' అని పిలుస్తున్నారు.
అలబామాలో అక్టోబర్ 10న ఓ పెద్ద శబ్దం వినిపించింది. అయితే స్థానికులంతా అది ఎఫ్‌ఏ-18 హార్నట్ విమానం నుంచి వెలువడిన శబ్దంగా భావించారు. రెండు వారాల తర్వాత దక్షిణ ఆస్ట్రేలియాలోని ఐర్ ద్వీపకల్పంలో అలాంటి శబ్దమే వినిపించింది.