KCR reviewed the development works of Yadadri with officials concerned. He said that there is a possibility of the population increasing in Yadagirigutta gram panchayat. In this connection, he directed officials to convert Yadagirigutta village into a municipality. He sanctioned 143 crore for the construction.
యాదాద్రి ఆలయ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. పనులు పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పనులు కూడా సగమే అయ్యాయని ఆయన అన్నారు. మీకు చేతనైతే చేయండి, లేకపోతే తప్పుకోండంటూ హెచ్చరించారు. పనులు పూర్తి చేయించడం ఎలాగో తనకు తెలుసునని అన్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా 20 ఏళ్లయినా ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు పూర్తికావని అన్నారు. ఆయన యాదాద్రి పనులను శుక్రవారంనాడు పరిశీలించారు. ఆలయ గోపుర నిర్మాణాన్ని పరిశీలిస్తూ- ఈ గోపురం మార్చి వరకు ఏ విధంగా పూర్తవుతుందని ఆర్కిటెక్ట్ ఆనందసాయిని అడిగారు. ఈ రకంగా పనులు చేస్తే బ్రహ్మోత్సవాలను ఏలా జరుపుతారని అడిగారు. శుక్రవారంనాడు ఆయన యాదాద్రి పనులను సమీక్షించారు.
ఆలయ విస్తరణ కోసం దక్షిణం వైపున చేపట్టిన పనులను ఆయన పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు ముందు తాను వచ్చి చూసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని అన్నారు. గోదావరి నీళ్లలో వంతెన నిర్మాణ పనులు ఏడాదిలోపు చేస్తున్నారని, అటువంటిది ఇక్కడి పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అన్నారు. ఏదైనా పని పూర్తయిందా అని అడిగారు.
యాదాద్రిలో పుష్కరిణిని కొండకింద గల గండిచెరువులో 33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని కెసిఆర్ ఆదేశించారు. పక్కన బస్టాండ్, క్యూకాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తులు కూర్చునేందుకు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రవచన ప్రాంగణం ఏర్పాటు చేయాలని సూచించారు యాదాద్రి టెంపుల్ సిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.143 కోట్లు ఆయన మంజూరుచేశారు.