Balakrishnudu is an Telugu romantic and action film, starring Nara Rohit, Regina Cassandra and Ramya Krishnan in lead roles. The film is directed by debutant Pavan Mallela. Melody Bramha Mani Sharma is the music director.
విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకోవడంలో యువ హీరో నారా రోహిత్ డిఫరెంట్ స్టయిల్. అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి లాంటి చిత్రాల తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం బాలకృష్ణుడు. ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన రెజీనా నటించింది. శరశ్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు పవన్ మల్లెల. బీ మహేందర్‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాలు అలియాస్ బాలకృష్ణుడు (నారా రోహిత్) అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి. కిరాయి గుండాగా పనిచేస్తుంటాడు. రాయలసీమలో ప్రతాప్‌రెడ్డి (అజయ్)తో వైరం ఉన్న కారణంగా భానుమతి (రమ్యకృష్ణ) తన మేనకోడలు ఆద్య (రెజీనా)కు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆద్యను రక్షించుకోవడానికి బాడీగార్డ్‌గా బాలును నియమిస్తుంది. అయితే ఆద్యకు మాత్రం బాలు తనకు బాడీగార్డ్ అనే విషయం తెలియదు. ఈ క్రమంలో బాలు, ఆద్య ఒకరినొకరు ప్రేమించుకొంటారు. కానీ ఆద్య ప్రాణాలు కాపాడటం అనే బాధ్యత గుర్తు వచ్చి బాలు ప్రేమను త్యాగం చేయాలనుకొంటాడు. ఈ మధ్యలో ఆద్యను ప్రతాప్ రెడ్డి మనుషులు వెంటాడుతుంటారు.