India posted 11 for the loss of one wicket at stumps on Day one of the second Test against Sri Lanka on Friday, trailing the visitors by 194 runs.
నాగ్‌పూర్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్(2), ఛటేశ్వర్ పుజారా(2) పరుగులతో ఉన్నారు. రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఓపెనర్ల నుంచి శుభారంభం దక్కలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణరత్నే (51), చండీమాల్ (57) పరుగులతో రాణించగా, మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా, జడేజా, ఇషాంత్ శర్మ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. కాగా రెండో టెస్టులో టీ విరామానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది . టీ విరామం అనంతరం భారత బౌలర్లు రెచ్చిపోయారు. టీ విరామానికి 151/4 పరుగులు చేసిన శ్రీలంక ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది.72వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్(57) పరుగుల వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. 72వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని చండీమాల్ ఎదుర్కొన్నాడు. దీంతో వెంటన్ అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కోహ్లీ.. అశ్విన్‌ను సంప్రదించి రివ్యూ కోరగా, రివ్యూలో చండీమాల్ ఔటనట్లు తేలింది.47వ ఓవర్లో కరుణరత్నే తన టెస్టు కెరీర్‌లో 14వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అలాగే ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా నిలిచాడు.