The controversy over the movie Padmavati took an ugly turn on Friday after a body was found at the Jaipur's Nahargarh fort, said reports. According to reports, a message "Padmavati ka virodh" (Protest against Padmavati) was found written on the fort wall next to the body.
విడుదల కాకముందే పద్మావతి సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఈ వివాదం మరింత ముదిరింది. జైపూర్‌లోని నహర్‌గఢ్ కోటలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే ఈ మృతదేహనికి సమీపంలోని బండరాళ్ళపై పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా రాశారు. కాగా ఈ సినిమా విడుదలను నిరసిస్తూ ఆ వ్యక్తి ఉరేసుకొన్నాడా, లేక ఎవరైనా అతడిని చంపేశారా అనేది మాత్రం తేలలేదు.
ఈ ఘటన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ వ్యక్తి మరణానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదల కాకముందే వివాదాస్పదమైంది. ఈ సినిమాను నిరసిస్తూ ఆందోళనలు కూడ సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడ ఈ తరహ నిరసనలు చోటు చేసుకోవడం గమనార్హం.