The Special Investigation Team (SIT) probing the abduction and sexual assault of a female actor in Kochi submitted the charge sheet against five other including actor Dileep here on Wednesday.
గత ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకుని, స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న సినీ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో సిట్ అధికారులు బలమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఒక రకంగా ఈ కేసు మాలీవుడ్‌లోనే కాదు, తమిళ ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌కి కూడా ప్రత్యేకమైనదే.
కావ్యమాధవన్‌తో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆధారాలతో తన మొదటి భార్య మంజు వారియర్ వద్ద బయటపెట్టిందని బాధిత నటిపై దిలీప్ కక్ష పెంచుకొని పల్సర్ సునీతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది. కావ్యా మాధవన్ తో ప్రేమాయణం లీకైన తర్వాత దిలీప్ మంజు వారియర్ కు విడాకులు ఇచ్చేశారు.
అప్పటినుంచి నటిపై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. 2013లోనే ఆమెపై అత్యాచారం చేయించడానికి స్కెచ్ వేశాడు. ఇందుకోసం పల్సర్ సునీతో చర్చలు జరిపిన దిలీప్.. రూ.1.5కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం.. రేప్ సమయంలో నటి అత్యాచార వీడియోలు, ఫోటోలు అత్యంత క్లారిటీతో చిత్రీకరించాలని చెప్పాడు. అన్నది ఇప్పుడు దిలీప్ పై ఉన్న బలమైన ఆరోపణ.
ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలతో నటుడు దిలీప్‌పై సిట్ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. దిలీప్‌ను 8వ ముద్దాయిగా, పల్సర్ సునీని మొదటి ముద్దాయిగా చేర్చింది. బాధిత నటిని మొదటి సాక్షిగా పేర్కొంది. ఆ తర్వాత సాక్షులుగా పేర్కొన్న వాళ్లలో దిలీప్ ఇద్దరు భార్యలు కూడా ఉండటం గమణార్హం