Politicians in the list include Jagan Mohan Reddy of YSR Congress who is accused by the agency of laundering at least Rs 368 crore through 31 shell companies linked to him and his associates.
షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను విదేశాలకు పంపించడం, ఆ తర్వాత ఆ డబ్బులు అవసరమైనప్పుడు పెట్టుబడుల రూపంలో విదేశీ కంపెనీల ద్వారా భారత్‌కు రప్పించడం.. ఇది మనీ లాండరింగ్. ఇలా హవాలా మార్గంలో విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బులు తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ జాబితాను ఈడీ రూపొందించింది. ఇందులో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది.
సూరత్‌కు చెందిన అఫ్రోజ్ మహ్మద్ హసన్‌ఫట్టా, మదన్‌లాల్ జైన్‌లు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తప్పుడు బిల్లులతో దుబాయ్, హాంకాంగ్‌లకు డబ్బును తరలించిన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. 30 డొల్ల కంపెనీల ద్వారా వీరిద్దరూ కలిపి రూ.5400 కోట్లు తరలించిన ఆరోపణలు ఉన్నాయి.
వైయస్ జగన్, ఆయన అనుచరులకు చెందిన 31 డొల్ల కంపెనీల ద్వారా కనీసం రూ.368 కోట్లు అక్రమంగా చలామణి చేసినట్లు జాబితాలో ఉందని, మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఛగన్ భుజ్‌బల్ 81 డొల్ల కంపెనీల ద్వారా రూ.200 కోట్లు అక్రమంగా చలామణి చేసినట్లు ఈడీ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈడీ వెల్లడించిన 12 పేర్లలో జగన్ పేరు 10వ స్థానంలో ఉంది.