The “local films” he is referring to are real-life private videos that are now the fastest selling commodities in this market
ఓ యువకుడు ఓ యువతిపై అత్యాచారం చేయడమే దారుణం అనుకుంటాం. కానీ అంతకంటే దారుణమైన విషయమిది. అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు అంగళ్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఒకప్పుడు పైరేటెడ్ సినిమాల విక్రయించిన కొంతమంది వ్యాపారులు ఇప్పుడు ఈ అత్యాచార వీడియోలను జోరుగా అమ్ముతున్నారు. వీటిని 'లోకల్ ఫిలిమ్స్' అని పిలుస్తున్నారు. అదేమంటే.. ఇప్పుడు వీటికే డిమాండ్.. యువకులు, విద్యార్థులు అడుగుతున్నారు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించే నాకా హిందోళ మార్కెట్ లో ఇప్పుడో కొత్త దందా నడుస్తోంది. ఈ మార్కెట్ లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. అత్యాచార వీడియోలకు డిమాండు పెరగడంతో కొందరు వ్యాపారులు వీటిని గుట్టుగా లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్‌లలో వేసి విక్రయిస్తున్నారు.తెల్లవారక ముందే నాకా హిందోళ మార్కెట్ లో ఈ రకమైన వ్యాపారం మొదలవుతోంది. కొన్ని షట్టర్లు సగమే తెరిచి ఉంటాయి. ఆయా దుకాణాల వద్దకు వచ్చిన యువకులు వాళ్లకేం కావాలో గుసగుసగా చెప్పి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళతారు. తిరిగి వాళ్లు వచ్చేసరికి ఆ పెన్ డ్రైవ్ లలో వారు కోరుకున్న సంఖ్యలో అత్యాచార వీడియోలు సిద్ధంగా ఉంటాయి.