India vs Sri Lanka: Bhuvneshwar And Dhawan Not To Play Second Test

2017-11-21 345

Test between India and Sri lanka, Bhuvneshwar Kumar, along with teammate Shikhar Dhawan have been released from the team for the second Test.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు పేసర్ భువనేశ్వర్ కుమార్, బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ దూరమయ్యారు. వ్యక్తిగత కారణాల రీత్యా వీరిద్దరూ నాగ్‌పూర్ టెస్టుకు దూరం అవుతున్నారని బీసీసీఐ ప్రకటించింది.శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ నవంబర్ 23న తన ప్రేయసి నుపుర్‌ను పెళ్లాడబోతున్నాడు. దీంతో లంకతో జరిగే చివరి రెండు టెస్టులకు అతడు దూరం అయ్యాడు. దీంతో భువనేశ్వర్ స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు.
కానీ రెండో టెస్టులో విజయ్ శంకర్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భువీ స్థానాన్ని ఇషాంత్ శర్మతో భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో ఓపెనర్‌ ధావన్‌ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అయితే ధావన్ మాత్రం మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడు.