According to a report by Times Now, the 44-year-old actress overwhelmed by the paparazzi's presence got irritated by the chaos and reached a point of tears. She instantly asked the paps to stop clicking her pictures.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య నవంబర్ 16న తన ఆరో పుట్టిన రోజు జరపుకున్న సంగతి తెలిసిందే. ఆరాధ్య బర్త్‌డేని బచ్చన్ ఫ్యామిలీ చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. బాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు బర్త్‌డే వేడుకలో సందడి చేశారు.
తన ఫాదర్ మరణించిన తర్వాత ఫంక్షన్స్‌కి కాస్త దూరంగా ఉన్న ఐష్ తన కూతురి బర్త్‌డేని మాత్రం తన స్వగృహం ప్రతీక్ష లో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించింది. ఆ తర్వాత దివంగతుడైన తన తండ్రి స్మారకార్థం 100 మంది చిన్నారులకు గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు చేయించాలని ఐష్ నిర్ణయించుకుంది.
దీనికి సంబంధించి ఓ ఆసుపత్రి సౌజన్యంతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసింది ఐష్. ఈ కార్యక్రమానికి మీడియా వాళ్లు కూడా వచ్చారు. ఆమె కన్నీళ్లకు కారణం ఫొటోగ్రాఫర్లే. తన తండ్రి స్మారకార్థం తలపెట్టిన ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యను ఫొటోగ్రాఫర్లు అదే పనిగా ఫొటోలు తీస్తుండటంతో ఆమె అసహనానికి గురైంది.
ఎంత చెప్పినా ఫొటోగ్రాఫర్లు వినకుండా ఒక ఫ్యాషన్ ఈవెంట్ తరహాలో ఫొటోలు తీస్తూనే ఉండటంతో ఐష్ ఫ్రస్టేట్ అయిపోయింది.