ఐ లవ్ పవన్ కల్యాణ్.. సీఎం అయితే చూడాలని ఉంది -కత్తి మహేశ్

2017-11-21 877

Critic Kathi Mahesh given bold statement on Pawan Kalyan. Kathi said he loves Pawan Kalyan. He wanted to see Power star as CM of Andhra Pradesh. And he wanted Pawan to be play crucial role in AP politics.

సినీ విమర్శకుడిగా కత్తి మహేశ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా వివాదాస్పద వ్యక్తిగా కూడా మంచి పేరు సంపాదించుకొన్నారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం ద్వారా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే కామెడీ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయంశమయ్యాయి.
రాజకీయాలకు సంబంధించి పవన్ కల్యాణ్‌పై కత్తి మహేశ్‌ ఇటీవల తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ చాలా సంఖ్యలో ఫోన్లు చేసి విసిగించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పుకొన్నారు.
ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో పవన్ పై విమర్శలు చేసినందుకుగానూ.. అలాగే రివ్యూలను ఉద్దేశించి కత్తి మహేశ్‌పై హైపర్ ఆది ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పవన్ గురించి కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.