హాట్ ‌హాట్‌గా సాయిధరమ్ తేజ్ హీరోయిన్

2017-11-20 1

Sai dharam tej's Tikka heroine Larissa Bonesi goes Hot. Larissa paints the social media red with jer latest Photoshoot. Earlier She posts a video which consist Sai Dharam tej goes viral in twitter.

లారిస్సా బొనెసి బ్రెజిల్ జాతీయురాలు. చైనా, అర్జెంటీనా, థాయ్‌లాండ్‌లో మోడలింగ్‌లో రాణించిన తర్వాత 2011 నుంచి భారత్‌లో మోడలింగ్, సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తున్నది. ఎన్నో అంతర్జాతీయ ఉత్పత్తి కంపెనీలకు ఆమె మోడలింగ్ చేశారు. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నది. అంతేకాకుండా ఫిలిప్స్, వివెల్ సోప్, మహింద్రా లాంటి కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా లారిస్సా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.
అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం నటించిన దేశీ బాయ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సైఫ్ ఆలీ ఖాన్‌తో గో గోవా గాన్ అనే చిత్రంలో లారిస్సా నటించింది.
2016లో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో తిక్క చిత్రంలో నటించడం ద్వారా టాలీవుడ్‌కు లారిస్సా పరిచయమైంది. తిక్క చిత్రంలో లారిస్సా గ్లామర్‌గా కనిపించింది.
తిక్క చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించినప్పుడు వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ మధ్య సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రేమిస్తానని చెప్పు అని సాయిధరమ్ తేజ్‌ను అనడం ఆ వీడియోలో కనిపించింది.