In a recent post Prakash Raj addressed two issues that have made headlines and become national news. One, Padmavati controversy and the other IIFI controversy about Sexy Durga and Nude being ousted from the festival by the I&B ministry.
సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న వివాదాస్పద "పద్మావతి" చిత్రం హీరోయిన్ దీపికా పదుకొణెకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ బాసటగా నిలిచారు. దీపిక పదుకొణె ముక్కును శూర్పణఖ తరహాలో కత్తిరిస్తామంటూ రాజ్‌పుట్ కర్ణి సంఘం చేసిన హెచ్చరికలను ఖండించారు. దీన్ని సమాజంలో పెరిగిపోతున్న అసహనంగానే పరిగణించాలన్నారు.
సినిమా విడుదల చేస్తే విధ్వంసం సృష్టిస్తామని కర్ణిసేన చేస్తున్న వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. కళాకారులపై దాడులకు పాల్పడతామని చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకరమని ట్విట్ చేశాడు. పద్మావతి షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండే వివాదాలు తార స్థాయికి చేరాయి.
మళ్లీ తగ్గిపోతుందిలే అని అందరు అనుకున్నారు. కానీ అది ఇప్పుడు చాలా సీరియస్ అయ్యింది. మొన్న ఒక వ్యక్తి హీరోయిన్ - డైరెక్టర్స్ తలలను నరికేస్తే రూ.5 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఇక రీసెంట్ గా మరొక వ్యక్తి ఏకంగా రూ.10 కోట్లను ఇస్తామని చెప్పాడు.