Andhrajyothy VS YS Bharati : Social media post goes viral

2017-11-20 9

Andhrajyothy paper published a story about Sakshi chairman YS Bharati's social media post

సోమవారం నాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన ఓ కథనం వివాదాస్పదంగా మారింది. వైఎస్ భారతి చేసిన తప్పుడు ట్వీట్ అంటూ ఆంధ్రజ్యోతి ఆ కథనాన్ని వెలువరించగా.. తనకసలూ సోషల్ మీడియాలో ఖాతానే లేదని, మీరే తప్పుడు కథనాన్ని వెలువరించారన్న రీతిలో వైఎస్ భారతి కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి కథనంలో ఏముందంటే!.. పంట పొలంలోని ఓ పంపు కింద జగన్ నీళ్లు తాగుతున్నట్టు వైఎస్ భారతి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ' ఈ ఒక్క చిత్రం చాలు ఎన్నో విషయాలకు సమాధానం చెప్పడానికి' అని పోస్టులో పేర్కొన్నారు.
అయితే ఇందులో ఉన్నది జగన్ కాకపోవడంతో.. 'భారతి తన భర్తనే గుర్తించలేకపోయారా?' అని కొంతమంది ప్రశ్నించారు. ఇక టీడీపీ అభిమానులైతే.. 'సీమలో పచ్చని పొలాల వద్ద ధారాళంగా నీరు వస్తున్న పంపులో జగన్ దాహం తీర్చుకున్నారు. ఇది టీడీపీ చేసిన అభివృద్ది అని పేర్కొన్నారు. నిజానికి ఆ పోస్టులో ఉన్నది సాక్షి రిపోర్టర్ ప్రదీప్ అని చెబుతున్నారు.