In the recent years, there's an alarming rise in cases across India and these incidents seem to be getting uglier and more frighteningly day by day.
సినిమాల ప్రభావం కేవలం థియేటర్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపు మాత్రమే ఉంటుందా?.. లేక కొంతమందిని సుదీర్ఘ కాలం ప్రభావితమయ్యేలా చేస్తుందా?.. అంటే రెండింటిలోను దేనికి కచ్చితమైన సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆమధ్య పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీను తానో సినిమాలో సీన్ ను స్ఫూర్తిగా తీసుకుని హత్య చేశానని చెప్పి సంచలనం సృష్టించాడు. ఇప్పుడింకో యువకుడు దండుపాళ్యం అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని మహిళలపై అత్యాచారాలకు తెగబడుతూ వస్తున్నాడు.
మ్యాథ్స్‌లో పట్టభద్రుడై, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో కొంతకాలం పనిచేసిన మదన్.. కొంతకాలం క్రితం జాబ్ కోల్పోయాడు. దీంతో బెంగుళూరులో జీవనం అతనికి కష్టంగా మారింది. వెంటనే చెన్నైకి మకాం మార్చి ఇక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడా జాబ్ దొరకకపోవడంతో ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ఓ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులకు అనుకోని రీతిలో మదన్ అరివళగన్(28) అనే యువకుడు చిక్కాడు. విచారణలో భాగంగా పోలీసులు అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న డేటాను పరిశీలించగా పోలీసులకే షాక్ తిన్నంత పనైంది.