జనసేనలో చేరడానికి సిద్దమవడం వల్లే నా ? వల్లభనేని హత్య వెనుక నిజాలు | Oneindia Telugu

2017-11-17 1,222

A 46-year-old businessman-turned-politician was found lost life in an open space at a busy residential area in Sanathnagar on Thursday morning. Vallabhaneni Srinivas Rao, a TRS leader.

టీఆర్ఎస్ పార్టీ నేత వల్లభనేని శ్రీనివాసరావు హత్య ఉదంతం సంచలనం రేపుతోంది. ఆస్తుల గొడవలే ఆయన ప్రాణాలు తీశాయా?.. లేక వ్యక్తిగత వివాదాలే ప్రాణాల మీదకు తెచ్చాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గురువారం తెల్లవారు జామున సనత్‌నగర్‌ బస్టాండ్ వద్ద శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కిరాతకంగా హత్య చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో మందు బాటిళ్లు ఉండటంతో.. మద్యం మత్తులోనే ఆయన హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
హత్య జరిగిన సనత్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో ఇటీవలే సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఇంకా కనెక్షన్ ఇవ్వకపోవడంతో హత్య తాలుకు దృశ్యాలేవి అందులో రికార్డు కాలేదు. సీసీటివి కెమెరాలు లేకపోవడంతో ఇక్కడే హత్య చేయాలని ముందుగానే పథకం రచించుకుని ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి

Videos similaires