లండన్ లో వున్న పవన్.. వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే

2017-11-17 889

The Telugu star and Jana Sena Party founder has been chosen for the Indo-European Business Forum's Excellence Award this year.

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ ఇండీ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందించనున్న ఎక్సలెన్సీ అవార్డ్ కి ఎంపికయిన సంగ‌తి తెలిసిందే. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను పవన్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు.
ఈ రోజు ఇండియా యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రదానం చేయనున్న ప్రతిష్టాత్మక "గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు"ను పవన్ అందుకోనున్నాడు. ఇందు కోసం గురువారం మధ్యాహ్నానికి లండన్ చేరుకున్నాడు పవన్. శుక్ర, శని వారాల్లో లండన్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు.
18వ తేదీన లండన్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో వెస్ట్ మినిస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లోని కింగ్స్ మెడికల్ కాలేజీలో పవన్ భేటీ అవుతారు.
కళలు, రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషిగాను హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో ప్రఖ్యాత ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఈ అవార్డును పవన్‌కు ప్రదానం చేయనుంది. ఇందులో భాగంగానే యూరప్‌లో షూటింగ్‌ ముగించుకున్న పవన్ లండ‌న్ చేరుకున్నారు. దీంతో అభిమానులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్‌ అవుతున్నాయి. రెండు రోజుల లండన్ పర్యటనలో పవన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. కొద్ది రోజులుగా PSPK25 సినిమా కోసం విదేశాల‌లో ఉన్న ప‌వ‌న్ అక్క‌డి నుండి డైరెక్ట్‌గా లండ‌న్ వెళ్లాడు.