Petrol price in India may rise to Rs 300 per litre following an ever-possible between the two oil-rich countries of the Middle East. The effect will also appear in India and petrol price would go all-time high. Such increase in petrol prices will have adverse effects on the livelihood of middle-class families.
పెట్రోల్ ధరలు ఇండియాలో రూ. 300 చేరుకొనే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పులు పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియాలో పెట్రోల్, డీజీల్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పులు ఇండియాలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందనే వార్త వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. లీటర్ పెట్రోల్ ధరలు కనీసం రూ. 70 దాటితేనే ఇతర దేశాలతో పోలిస్గే ఇండియాలో ఈ ధరలు ఎక్కువనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.